Site icon HashtagU Telugu

Ariana Glamour Show : అరియానా గ్లామర్ షో వెనక కారణాలు ఏంటో..?

Ariana Glamour Show Instagram Post

Ariana Glamour Show Instagram Post

Ariana Glamour Show బిగ్ బాస్ సీజన్ 4 లో సత్తా చాటిన అరియానా ఆ షో తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ బజ్ యాంకర్ గా చేసిన అమ్మడు ఈమధ్య కాస్త బొద్దుగా మారి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా నో లిమిట్స్ అనేలా చేస్తుంది అరియానా. సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే గ్లామర్ ట్రీట్ అందించాల్సిందే. ఈ ఫార్ములాని త్వరగానే కనిపెట్టిన అరియానా లేటెస్ట్ గా తన స్కిన్ తో అదరగొట్టేస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

ముఖ్యంగా ఈమధ్య ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ర్యాప్ సింగర్ రోల్ రైడా తో కలిసి ఒక సాంగ్ చేసింది. ఈ సాంగ్ ప్రమోషన్ కోసమో మరో కారణమో కానీ ఈమధ్య గ్లామర్ ట్రీట్ తో తన ఫాలోవర్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది అరియానా. తన స్కిన్ షోతో మెస్మరైజ్ చేస్తూ వస్తున్న అరియానా సరైన ఛాన్స్ ఇస్తే ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అనే హింట్ ఇస్తుంది.

అరియానా చేస్తున్న ఈ గ్లామర్ షోకి ఆమె ఫాలోవర్స్ మాత్రం ఫిదా అవుతున్నారు. బిగ్ బాస్ తర్వాత ఆ క్రేజ్ ని అన్నివిధాలుగా వాడుకుంటున్న అరియానా మునుపటి కన్నా గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం అరియానా స్పెషల్ సాంగ్, స్పెషల్ రోల్స్ చేయాలని అనుకుంటుంది.

Also Read : Surya : సూర్య కోసం వెయిటింగ్ లిస్ట్ లో తెలుగు దర్శకులు..!