Site icon HashtagU Telugu

Ariana : ఆంటీ కామెంట్స్ పై అరియానా సీరియస్..!

Ariana Fire On Netizen On H

Ariana Fire On Netizen On H

Ariana సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ మీద తమకున్న అభిప్రాయాన్ని ఎలాంటి అడ్డు లేకుండా చెప్పేయడం జరుగుతుంది. సెలబ్రిటీస్ అది సినిమా వాళ్లైనా బుల్లితెర వారైనా ఫాలోవర్స్ ని చూసి సంతోష పడటమే కాదు అప్పుడప్పుడు వారి నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్ అరియానా తనని ఆంటీ అంటూ చేస్తున్న కామెంట్స్ పై నెటిజెన్ల మీద ఫైర్ అయ్యింది.

బిగ్ బాస్ (BiggBoss) ముందు ఆర్జీవి ఇంటర్వ్యూతో పాపులర్ అయిన అరియానా బిగ్ బాస్ తర్వాత చాలా క్రేజ్ తెచ్చుకుంది. మరోపక్క అమ్మడు సోషల్ మీడియాలో తన రెగ్యులర్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది. అయితే బిగ్ బాస్ టైం లో బక్క పలచగా ఉండే అరియానా ఈమధ్య కాస్త బొద్దుగా మారింది. అరియానా ఈ చేంజ్ ఓవర్ కి కారణం ఏంటన్నది తెలియదు కానీ అరియానా కాస్త బరువెక్కింది. అయినా సరే ఆమె ఫోటో షూట్స్ చేస్తూనే ఉంది.

Also Read : TSRTC : బతుకమ్మ, దసరా కోసం టీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు.. గ‌త ఏడాది కంటే అద‌నంగా..?

లావుగా మారిన అరియానా (Ariana) ఫోటో షూట్స్ చూసిన ఫాలోవర్స్ ఏంటి ఇలా తయారయ్యావ్..? ఆంటీలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనని ఆంటీ అంటూ కామెంట్ చేసిన వారికి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది అరియానా. తన మీద కామెంట్స్ చేస్తున్నారు ఓకే కానీ మీరు ఏం చేస్తున్నారు. నా లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతుంది మీ లైఫ్ లో ఏం జరుగుతుంది. ఒకరిని కామెంట్ చేయడం చాలా ఈజీ కానీ ఇవతల వారికి అది ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి.

నేను లావైతే మీకేంటి సన్నగా ఉంటే మీకేంటి మీ లిమిట్స్ లో మీరు ఉండండి అంటూ నెటిజెన్ల మీద ఫైర్ అయ్యింది అరియానా. అరియానా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join