Khatija Rahman : ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా కీలక పోస్ట్ చేశారు. వైవాహిక బంధానికి స్వస్తి పలికిన ఏఆర్ రెహమాన్, ఇక సంగీతానికి కొంతకాలం దూరంగా ఉంటారంటూ కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. సంగీతానికి ఏఆర్ రెహమాన్ దూరం అవుతారనే ప్రచారంలో నిజం లేనే లేదని ఖతీజా రెహమాన్ స్పష్టం చేశారు. అవన్నీ వదంతులే అని తేల్చి చెప్పారు. తన తండ్రి ఏఆర్ రెహమాన్ కెరీర్ గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాకు ఆమె హితవు పలికారు.
Also Read :CM Revanth Tweet : తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. తొలి ఏడాది సక్సెస్ : సీఎం రేవంత్
విశ్వసనీయ వర్గాల సమాచారం అనే పదాన్ని వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా వార్తలను ప్రచురించడం సబబు కాదని ఖతీజా(Khatija Rahman) పేర్కొన్నారు. ఈ విధంగా కోట్ చేస్తూ ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఆమె ఈసందర్భంగా ప్రస్తావించారు. ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ వివాహ బంధంపై వదంతులు ప్రచారమైనప్పుడు కూడా ఖతీజా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. తమ ఫ్యామిలీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సంస్కారం కాదని అప్పట్లో ఆమె సూచించారు.
Also Read :Fake Doctors Exposed : 100 మంది ఫేక్ డాక్టర్లు దొరికారు.. జనం ప్రాణాలతో చెలగాటం
మరోసారి ఆస్కార్ రేసులో ఏఆర్ రెహమాన్ ?
ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందించిన మూవీ ‘ఆడు జీవితం’ను ఉత్తమ సాంగ్, ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరీలలో ‘ఆస్కార్ 2025’ పురస్కారం కోసం షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ పని నిమిత్తం అరబ్ దేశానికి వెళ్తాడు. అక్కడి బాస్ చేతిలో మోసపోయిన నజీబ్ గొర్రెల కాపరిగా మారుతాడు. నజీబ్ 700 మేకలతో ఎడారిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి నజీబ్ ఎలా చేరుకుంటాడు అనేది ఈ మూవీలోని కథాంశం. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. ఆయన భార్యగా అమలా పాల్ నటించారు.