మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలు ఏ అంశాన్ని విడుదల చేసినా అది అద్భుతమైన స్పందనను అందుకోవడం విశేషం. ముందుగా విడుదలైన ‘పెద్ది గ్లింప్స్’ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోగా, అందులో రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘చికిరి’ పాట ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుని తన తడాఖా చూపించింది. ఈ పాట విడుదలైన తర్వాత ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ‘పెద్ది’ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనప్పుడు ఆశ్చర్యపోయి, అనుమానం వ్యక్తం చేసినవారంతా ఇప్పుడు ‘రెహమాన్ కరెక్ట్ ఆప్షన్’ అని కితాబు ఇస్తున్నారు.
Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !
‘చికిరి’ పాట ఏ.ఆర్. రెహమాన్‌కు ఒక మంచి కంబ్యాక్‌ను అందించింది. కొంతకాలంగా ఆయన సంగీతం తెలుగు ప్రేక్షకులను గతంలో మాదిరిగా మెస్మరైజ్ చేయలేకపోతుందనే విమర్శ ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా పల్స్, మాస్ హీరోల క్రేజ్‌ను రెహమాన్ సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారనే అభిప్రాయానికి ‘చికిరి’ పాట పుల్‌స్టాప్ పెట్టింది. ఈ పాట అద్భుత విజయం సాధించడం, రెహమాన్ కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారబోతోంది. ఇప్పుడు ‘పెద్ది’ నుంచి రెండో పాట కూడా రాబోతోంది. చిత్ర యూనిట్ ఈ పాటను డిసెంబర్ నెలలో ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండో పాట వేరే స్థాయిలో ఉంటుందని ‘చికిరి’ కేవలం మెచ్చుతునకే అని, ఇక రాబోయే పాటలన్నీ అంతకు మించి ఉంటాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.
‘చికిరి’ తరహాలో రెండో పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిస్తే తెలుగులో రెహమాన్ మరోసారి బడా హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు. ప్రతి హీరోకూ రెహమాన్‌తో పనిచేయాలని ఉంటుంది, కానీ ఆయన ఫామ్ చూసి కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ‘పెద్ది’తో రెహమాన్ తన పాత ఫామ్‌లోకి వస్తే, తెలుగులో పెద్ద హీరోలకు మరో అద్భుతమైన సంగీత దర్శకుడు దొరికినట్టే అవుతుంది. రెండో పాట లిరికల్ వీడియో కూడా ఆసక్తికరంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఆల్బమ్ రెహమాన్ స్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ పటిష్టం చేయనుంది.
