Site icon HashtagU Telugu

Nagarjuna : మా ‘బంగార్రాజు’ అంటూ నాగ్ ఫ్యాన్స్ ప్రశంసలు

Nag Fan

Nag Fan

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna ) వివాదాలకు చాల దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన సినిమాలు , తన బిజినెస్ లు తప్ప మరో జోలికి వెళ్ళాడు. అప్పుడప్పుడు ఇతర సినిమా ఫంక్షన్ లకు హాజరవుతారు అంతే. అలాంటి నాగార్జున తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున..ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘కుబేర’ (Kubera) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్ లో జరుగుతుంది. హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ధనుష్, నాగార్జున లు నడుస్తూ వస్తుండగా.. నాగార్జునను చూసిన‌ అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి ఎంతో ఆత్రుత‌తో నాగ్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

నాగార్జునకు మరింత దగ్గరికి రావడంతో పక్కనే ఉన్న బాడిగార్డ్‌ ఆయనను పక్కకు నెట్టారు. దీంతో ఆయన అదుపు తప్పి కింద పడపోయాడు. ఇంతలో త‌మాయించుకుని నిలబడ్డారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ సంఘటన నాగార్జున దృష్టికి వెళ్లడం తో..రియాక్ట్ అయ్యారు. ఎక్స్‌వేదిక‌గా ఆ వృద్ధ అభిమానికి నాగార్జున క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇప్పుడు అదే ఎయిర్ పోర్ట్ లో అదే అభిమానిని దగ్గరకు తీసుకొని సరదగా మాట్లాడడం..ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. మొన్న నాగార్జున ఫై విమర్శలు చేసిన వారే..ఈరోజు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా నాగ్ మామ ది గోల్డెన్ హార్ట్ రా అని కొంతమంది..మా నాగ్ బాంగ్రారాజు అని మరికొంతమంది కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Pawan Kalyan : స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ రికార్డ్స్ లో లేని రూ.1,066 కోట్లు