Nandi Awards : గతంలో టాలీవుడ్ కి రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేవారు. నంది అవార్డులను ఒక గొప్ప అర్హతగా భావించేవారు సినీ పరిశ్రమ వ్యక్తులు. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఎవరూ నంది అవార్డులను పట్టించుకోలేదు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నంది వారసులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించడం, ఎంట్రీలు తీసుకోవడం జరిగాయి.
తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఏలూరులో భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. అయితే ఏలూరులో జరిగిన ఈ ఈవెంట్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపి పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ.. ఇలా పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఏపీలో చలనచిత్ర రంగంలో మళ్లీ నంది అవార్డులు ఇవ్వబోతున్నాం. త్వరలో చిత్ర పరిశ్రమను నంది అవార్డులతో ప్రోత్సహిస్తాం. చలనచిత్ర ప్రముఖులతో త్వరలోనే ప్రత్యేక భేటీ కాబోతున్నాం. హైదరాబాద్ లాగే వైజాగ్ ను చిత్ర పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఏపీలో ఉన్న సినిమా షూటింగ్స్ స్పాట్స్ ను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తాం. ఒక నటుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి అని అన్నారు. నంది అవార్డులు ఇస్తాం అని చెప్పడంతో టాలీవుడ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Anasuya : మా ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడు.. అనసూయ పోస్ట్ వైరల్..