Anushka Trisha : అనుష్క నో అంటే త్రిషకు ఛాన్స్ ఇచ్చారా..?

Anushka Trisha దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా జి.ఓ.ఏ.టి. ఈ సినిమా ను జూన్, జూలై నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Anushka Missed And Trisha Picked That Chance

Anushka Missed And Trisha Picked That Chance

Anushka Trisha దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా జి.ఓ.ఏ.టి. ఈ సినిమా ను జూన్, జూలై నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో విజయ్ నటిస్తున్నారు. అయితే యంగ్ విజయ్ కి జతగా మీనాక్షి చౌదరి జత కడుతుండగా మిడిల్ ఏజ్ విజయ్ కి జతగా త్రిషని ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన లియో సినిమాలో విజయ్ తో జత కట్టింది త్రిష. అంతకుముందు కూడా విజయ్ తో త్రిష మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. విజయ్ జి.ఓ.ఏ.టి సినిమాలో త్రిష క్యామియో రోల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. అయితే త్రిష చేస్తున్న ఈ పాత్రకు ముందు స్వీటీ అనుష్కని అనుకున్నారట.

స్టార్ హీరోయిన్ అనుష్క సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది. రీసెంట్ గా మలయాళంలో కథనార్ సినిమాకు సైన్ చేసింది అనుష్క. విజయ్ జి.ఓ.ఏ.టి సినిమాలో త్రిషకు అనుకున్న పాత్రకు ముందు అనుష్కని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో త్రిషకు ఆ ఛాన్స్ వెళ్లింది. ఆల్రెడీ త్రిష మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా విజయ్ జి.ఓ.ఏ.టి సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది.

Also Read : RC16 టైటిల్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి..! –

  Last Updated: 15 Mar 2024, 06:44 PM IST