Anushka : అనుష్క 50.. ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నారా..?

Anushka స్వీటీ అనుష్క సినిమాల విషయంలో చాలా లేట్ చేస్తుంది. అసలు ఆమెకు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లేదా ఏంటంటూ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా

Published By: HashtagU Telugu Desk
Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka స్వీటీ అనుష్క సినిమాల విషయంలో చాలా లేట్ చేస్తుంది. అసలు ఆమెకు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లేదా ఏంటంటూ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తో సర్ ప్రైజ్ చేసింది అనుష్క. నవీన్ పొలిశెట్టి ఎంత వన్ మ్యాన్ షో చేసినా అనుష్క గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఫలితంగా సినిమా మంచి హిట్ గా నిలిచింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Ms Shetty Mr Polishetty)తో హిట్ అందుకున్న అనుష్క ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తుంది.

ఇప్పటికే మెగా 156 సినిమాలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనుష్క తన సూపర్ హిట్ మూవీ భాగమతి (Bhagamathi)కి సీక్వెల్ లో నటిస్తుందని టాక్. భాగమతి సినిమా అశోక్ డైరెక్ట్ చేయగా యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. బాహుబలి (Bahubali) తర్వాత అనుష్క రేంజ్ హిట్ అందుకున్న సినిమా అది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా భాగమతి 2 ప్లానింగ్ లో ఉన్నారట.

Also Read : Laxmi Raai : హైదరాబాద్ లో లక్ష్మి రాయ్ సందడి.. అమిగాస్ బార్ & కిచెన్ లాంచింగ్‌లో..

థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే మరోసారి ఆడియన్స్ ని థ్రిల్ ఫీలయ్యేలా చేయాలని భాగమతి 2 ప్లాన్ చేస్తున్నారు. అనుష్క 50వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుందని టాక్. ఇదే కాకుండా కన్నడలో కూడా అనుష్క ఒక సినిమా సైన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అనుష్క మళ్లీ వరుస సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని జోష్ ఇస్తుంది.

స్టార్ హీరోయిన్ గా అనుష్క ఇచ్చిన ప్రతి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. అనుష్క రెగ్యులర్ గా సినిమాలకు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 08 Nov 2023, 01:05 PM IST