Site icon HashtagU Telugu

Anupama Parameswaran: తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన అనుపమ.. అత్తయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

Anupama Parameswaran

Anupama Parameswaran

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది అనుపమ. మొదట అఆ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ సంగతి పక్కన పెడితే అనుపమ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. టిల్లు స్క్వేర్ సినిమాతో రూటు మార్చింది అను. అచ్చంగా తెలుగమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించే అనుపమ ఈ మూవీలో లిల్లీ పాత్రలో గ్లామర్ హద్దులు చేరిపేసింది. ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించని రేంజ్‏లో కనిపించి షాకిచ్చింది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన లిల్లీ పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీతో అనుపమ మరో టాలెంట్ చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల కాలంలో అనుపమ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా ఆ పోస్ట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటారు.

Also Read: Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!

ఇటీవల తన తమ్ముడిని హగ్ చేసుకున్న ఫోటోస్ షేర్ చేయగా.. బామ్మర్ది మీ అక్క జాగ్రత్తగా అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు తన తల్లికి బర్త్ డే విషెష్ తెలుపుతూ తల్లి సునీతతో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఇక అనుపమ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అత్తమ్మా హ్యాపీ బర్త్ డే.. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తగారూ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండగా ఇద్దరూ అక్కా చెల్లెల్లుగా కనిపిస్తున్నారంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి నెటిజన్స్ కామెంట్స్ పై అనుపమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Also Read; Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?