Anupama : టిల్లు కోసం అనుపమ గ్లామర్ షో..!

Anupama డీజే టిల్లుతో డ్యాషింగ్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో కూడా అదే రేంజ్ రిజల్ట్ అందుకోవాలని చూస్తున్నాడు. టిల్లు స్క్వేర్

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 12:06 PM IST

Anupama డీజే టిల్లుతో డ్యాషింగ్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో కూడా అదే రేంజ్ రిజల్ట్ అందుకోవాలని చూస్తున్నాడు. టిల్లు స్క్వేర్ సినిమా మల్లిక్ రాం డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా న్యూ ఇయర్ పోస్టర్ టిల్లు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

ప్రేమం సినిమాతో పక్కింటి అమ్మాయిగా కనిపించి యూత్ ఆడియన్స్ ని మెప్పించిన అనుపమ సడెన్ గా గ్లామర్ టర్న్ తీసుకుంది. అవకాశాలు రావట్లేదనో లేక గ్లామర్ ఫీల్డ్ లో ఇలా ఉండటం కరెక్ట్ అనో కానీ అనుపమ ఈ మేకోవర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక సూపర్ హిట్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ కోసం అనుపమ గ్లామర్ డోస్ మరింత పెంచేసిందని చెప్పొచ్చు.

హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్ లో సిద్ధుతో అనుపమ స్టిల్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. టిల్లు స్క్వేర్ కథ కథనాలే కాదు అనుపమ గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డిజే టిల్లు ని మించేలా టిల్లు స్క్వేర్ ప్లానింగ్ ఉంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Also Read : Hanuman Pre Release Event : హనుమాన్ కోసం ఆ ఇద్దరు స్టార్స్..!