Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెంటనే రంగంలోకి […]

Published By: HashtagU Telugu Desk
Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.

ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెంటనే రంగంలోకి దిగింది. తమ యాంటీ పైరసీ బృందం సోషల్ మీడియాను నిరంతరం గమనిస్తోందని స్పష్టం చేసింది. లీకైన వీడియోలను షేర్ చేసినా, ప్రమోట్ చేసినా సంబంధిత సోషల్ మీడియా ఖాతాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ అకౌంట్లను శాశ్వతంగా తొలగిస్తామని గట్టిగా హెచ్చరించింది.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబుతో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఎలాంటి లీకేజీలను ప్రోత్సహించవద్దని, కేవలం అధికారిక అప్‌డేట్స్ కోసం మాత్రమే వేచి చూడాలని చిత్ర బృందం అభిమానులను కోరింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతుండటంతో కోలీవుడ్‌లో ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

  Last Updated: 17 Apr 2026, 01:01 PM IST