Kamal Hassan Thug Life : కమల్ థగ్ లైగ్ కి బిగ్ షాక్.. నిన్న దుల్కర్ నేడు అతను కూడా..?

Kamal Hassan Thug Life లోకనాయకుడు కమల్ హాసన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు పాతిక ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. నాయకుడు తర్వాత వీళ్లిద్దరు కలిసి

Published By: HashtagU Telugu Desk
Another Hero Exit From Kamal Hassan Thug Life Maniratnam Movie

Another Hero Exit From Kamal Hassan Thug Life Maniratnam Movie

Kamal Hassan Thug Life లోకనాయకుడు కమల్ హాసన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు పాతిక ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. నాయకుడు తర్వాత వీళ్లిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కమల్ లుక్ స్టైల్ అంతా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు ఇంపార్టెంట్ రోల్స్ లో మరికొందరు స్టార్స్ నటిస్తున్నారని ప్రకటించారు.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తో పాటుగా కోలీవుడ్ హీరో జయం రవి కూడా కమల్ థగ్ లైఫ్ లో భాగం అవుతున్నారని అనౌన్స్ చేశారు. కానీ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే దుల్కర్ తన డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యాడు. లేటెస్ట్ గా జయం రవి కూడా సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వలేనని చెప్పి తప్పుకున్నాడట.

థగ్ లైఫ్ కోసం మూడు నాలుగు నెలలు బల్క్ డేట్స్ ఇవ్వాలని మణిరత్నం కండీషన్ పెట్టాడట. వేరే సినిమాలతో కమిట్ అయిన దుల్కర్, జయం రవి ఈ సినిమా కోసం అంత టైం కేటాయించలేమని చెప్పారట. సో అలా కమల్ థగ్ లైఫ్ నుంచి దుల్కర్ సల్మాన్, జయం రవి ఇద్దరు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కించాలని అనుకున్న మణిరత్నం ప్లాన్స్ కు ఈ హీరోలు ఎగ్జిట్ అవ్వడం వల్ల దెబ్బ పడేలా ఉంది.

Also Read :Raviteja Mister Bacchan : రవితేజ మిస్టర్ రిలీజ్ ఎప్పుడు.. మాస్ రాజా ప్లానింగ్ ఏంటి..?

  Last Updated: 25 Mar 2024, 10:17 AM IST