Bhola Shankar : మరో ఛాన్స్ కు మెహర్ మళ్లీ ఎన్ని ఏళ్లు వెయిట్ చేయాలో..?

కనీసం మెగా అభిమానులకు కూడా సినిమా నచ్చలేదంటే మెహర్ ఏ రేంజ్ లో సినిమా తీసాడో అర్ధం చేసుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Another chance for Meher Ramesh is difficult

Another chance for Meher Ramesh is difficult

మెహర్ రమేష్ (Meher Ramesh)..నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఈ పేరు తెగ చక్కర్లు కొడుతుంది. కంత్రి సినిమాతో డైరెక్టర్ గా తెలుగు లో అడుగుపెట్టిన రమేష్..మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత బిల్లా , శక్తి , షాడో వంటి వరుస హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్నాడు. 2013 లో షాడో రిలీజ్ అవ్వగా..మళ్లీ 2023 లో మెహర్ నుండి భోళా శంకర్ మూవీ వచ్చింది. అంటే సరిగ్గా మెహర్ నుండి సినిమా రావడానికి పదేళ్లు పట్టింది.

భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం విడుదలైన భోళా శంకర్ (Bhola Shankar) కు అన్ని చోట్ల నెగిటివ్ టాక్ వచ్చింది. కనీసం మెగా అభిమానులకు కూడా సినిమా నచ్చలేదంటే మెహర్ ఏ రేంజ్ లో సినిమా తీసాడో అర్ధం చేసుకోవచ్చు. తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం మూవీ ని అచ్చం తెలుగు లో దింపేసాడు. భారీ తారాగణం..మెగాస్టార్ చిరంజీవి , కీర్తి , తమన్నా , AK ఎంటర్టైన్మెంట్ వంటి భారీ నిర్మాణ సంస్థ ఇలా అన్ని ఉన్నప్పటికీ..ఏది సరిగా వాడుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ జాబితాలో చేర్చాడు. దీంతో మెహర్ కనిపిస్తే కొడతాం అంటున్నారు మెగా వీరాభిమానులు. ఇక జన్మలో మెహర్ మంచి సినిమా తీయలేడని , ఇంకో ఛాన్స్ ఎవ్వరు ఇవ్వరని అంటున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది.

ఎందుకంటే షాడో తరువాత మెహర్ కు ఏ ఒక్క నిర్మాతకాని , హీరో కానీ ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలే..చెప్పులు అరిగేలా అందరి చుట్టూ తిరిగినప్పటికీ ఎవ్వరు కనికరించలేదు. ఆలా పదేళ్లు ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భోళా శంకర్ సినిమా ఛాన్స్ ఇస్తే దానిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయినా చిత్రమే..ఆ కథను మన తెలుగు ఆడియన్స్ కు నచ్చేలా..చిరంజీవి నుండి అభిమానులు ఇంకోరుకుంటారో అవి పెట్టి..కాస్త పాటలు బాగుండేలా..కామెడీ నవ్విచేలా ..పెట్టి ఉంటె సినిమా బాగుండేది. కానీ చిరాకు పుట్టించే సన్నివేశాలతో..ఎప్పుడు లేచిపోదామా అనే విధంగా పాటలు..బిల్డప్ ఎక్కువ అనే రేంజ్ లో ఫైట్స్ పెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. సినిమా టాక్ తో టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా థియేటర్ కు పోనీ పరిస్థితి తీసుకొచ్చాడు. మరి సినిమా ఫలితం తో మెహర్ సినీ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Botsa Challenge : బొత్స ‘గుండు ‘ ఛాలెంజ్..బండ్ల గణేష్ ను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు..

  Last Updated: 12 Aug 2023, 07:18 AM IST