Site icon HashtagU Telugu

Prabhas and Hrithik: పఠాన్ ఎఫెక్ట్.. బాలీవుడ్ లో మరో భారీ మూవీ.. ప్రభాస్ తో హృతిక్!

Prabhas And Hritik

Prabhas And Hritik

బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా మారాడు ప్రభాస్ (Prabhas). ఇప్పటికే ఆయన చేతిలో ఆరు భారీ ప్రాజెక్టులున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ మూవీలో ప్రభాస్ (Prabhas) నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కలసి సినిమా చేసేందుకు కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండేళ్ల క్రితం ప్రతిపాదించింది. కానీ పట్టాలెక్కలేదు. అయితే నిర్మాత సంస్థ ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు కావలసినది ఇవ్వాలని నిర్ణయించుకుంది.

షారుఖ్ ఖాన్ “పఠాన్” (Pathaan) విజయం సాధించడంతో భారీ బడ్జెట్ చిత్రాన్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ సిద్ధార్థ్ కు ఉందని మైత్రికి నమ్మకం ఏర్పడింది. ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas), హృతిక్ రోషన్ ఇద్దరూ నటించనున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా భావిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ తన తదుపరి చిత్రం, హృతిక్ రోషన్ నటించిన “ఫైటర్” నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత 2024లో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌పై పని చేయడం ప్రారంభిస్తాడు. ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో బాక్సాఫీస్ వద్ద హైప్ ఏర్పడుతుందని, రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Priyanka Chopra Daughter: సో క్యూట్.. ముద్దుల కూతురి ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక!