Site icon HashtagU Telugu

Srileela : ప్రభాస్ తో జోడీ.. శ్రీ లీల జోరు తగ్గట్లేదుగా..!

Another Big Offer For Srile

Another Big Offer For Srile

కన్నడ భామ శ్రీ లీల (Srileela ) టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన అమ్మడు రవితేజ ధమాకాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి స్టార్ సినిమాలతో పాటుగా రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ లాంటి హీరోలతో కూడా జత కడుతుంది. రామ్ తో చేసిన స్కంద మరో 3 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే 8 వరుస సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్స్ కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని శ్రీ లీల. లేటెస్ట్ గా మరో గోల్డెన్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

ఈసారి ఏకంగా ప్రభాస్ తో రొమాన్స్ కు రెడీ అవుతుంది శ్రీ లీల. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పూర్తి చేశాక హను రాఘవపుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రభాస్ తో కూడా బోర్డర్ లో లవ్ స్టోరీ చేసే ఆలోచనలో ఉన్నాడు హను. సో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలని ఫిక్స్ చేశారు.

మహేష్ గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లతో పాటుగా ప్రభాస్ సినిమా కూడా చేస్తే టాలీవుడ్ లో శ్రీలీల (Srileela)కు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా క్రేజ్ తో పాటు మరింత్ పాపులారిటీ అమ్మడు సొంతం అవుతుంది. చేతినిండా సినిమాలతో సత్తా చాటుతున్న శ్రీ లీల ఈ సినిమాల వల్ల మిగతా వారికి నో చెప్పాల్సి వస్తుందని తెలుస్తుంది.

ఏ ముహూర్తాన అమ్మడు టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో ఏమో కానీ శ్రీ లీల మాత్రం ఇక్కడ దూసుకెళ్తుంది. చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా అమ్మడి దశ తిరిగి నట్టే అని చెప్పొచ్చు.

Also Read : Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

Exit mobile version