Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ ప్రేమకి మరో గుంట ఫ్లాట్.. కలిసి తన ప్రేమను చూపిస్తా అంటున్న ముద్దుగుమ్మ..!

Another Beauty Fallin Love With Prabhas With His Love

Another Beauty Fallin Love With Prabhas With His Love

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా పై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెబుతున్నారు. సినిమా మే 9న రిలీజ్ అనుకుంటున్నా ఆ డేట్ కి రావడం కష్టమే అని అంటున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ప్రభాస్ ప్రతి సినిమా టైం లో అందులో నటించే కాస్ట్ కి స్పెషల్ భోజనం తెప్పిస్తుంటాడు. ప్రభాస్ భోజనం గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పారో తెలిసిందే. బాలీవుడ్ భామలు దీపిక, దిశా పటాని, కృతి సనన్ ఇలా అందరు ప్రభాస్ భోజనం గురించి అతని ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో భామ చేరింది. మలయాళ భామ అన్నె బెన్ తన టాలెంట్ తో అందరినీ మెప్పిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆమె కల్కి సినిమాలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ ఫోన్ చేసి ఈ సినిమాలో ఉన్నావని అనగానే ఆమెకు చాలా సంతోషం అనిపించిందట. ఇక ఈ సినిమా టైం లో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటుంది అన్న బెన్.

ప్రభాస్ ని కలిసే అవకాశం రాలేదు కానీ కలిస్తే తప్పకుండా అతని మీద ఉన్న అభిమానాన్ని చూపుతా అంటుంది అన్నా బెన్. ప్రభాస్ ఖాతాలో మరో అందాల భామ కూడా పడిపోయింది. ఏది ఏమైనా మన డార్లింగ్ అందరిని మెప్పించడమే పనిగా పెట్టుకున్నాడని చెప్పొచ్చు.

Also Read : IMDBs Most Awaited movies in 2024 : ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ ఇన్ 2024.. లిస్ట్ లో పుష్ప 2 టాప్ కల్కి తర్వాతే దేవర..!