Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 బడ్జెట్ పెరిగిందా.. 200 కోట్లు అనుకుంటే ఇప్పుడు..!

Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సెన్సేషనల్ మూవీ పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ లో సృష్టించిన బీభత్సం తెలిసిందే. పుష్ప రాజ్ మాస్ మేనియాకి నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో పుష్ప 2 ని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ కూడా సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా రెడీ అనేస్తున్నాడట.

ఇదిలాఉంటే పుష్ప 1 అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసిన సుక్కు పార్ట్ 2 విషయంలో మాత్రం భారీ ప్లానింగ్ తో ఉన్నాడట. పుష్ప 2ని అసలైతే 200 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలని అనుకోగా అది కాస్త ఎక్కువ అవుతుందని టాక్. సినిమాలో చిన్న సీన్ కోసం కూడా సుకుమార్ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిస్తున్నారట. పార్ట్ 2 మొదలు పెట్టడానికి ముందే కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది.

పుష్ప 2 కోసం మైత్రి మూవీ మేకర్స్ 200 కోట్లు బడ్జెట్ అనుకోగా దానికి మరొ 50 శాతం అంటే మరో 100 కోట్ల దాకా బడ్జెట్ పెరుగుతుందని తెలుస్తుంది. పుష్ప 2 విషయంలో నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం 700 నుంచి 1000 కోట్లు రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మరి పుష్ప 2 లో పుష్ప రాజ్ ఏం చేస్తాడన్నది చూడాలి. సినిమా సెకండ్ పార్ట్ లో ఫాహద్ ఫాజిల్ పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. పుష్ప రెండో భాగం కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Also Read : Mahesh Guntur Karam : గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అంతే.. నిర్మాత కామెంట్స్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి..!

We’re now on WhatsApp : Click to Join