Site icon HashtagU Telugu

Bobby Deol : యానిమల్ విలన్ డిమాండ్ బాగుందిగా..?

Animal Villain Bobby Deol Huge Demand for Vijay 69

Animal Villain Bobby Deol Huge Demand for Vijay 69

బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కి యానిమల్ సినిమా ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. ఆయన్ను తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసిన సినిమా యానిమల్. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించాడు. రష్మిక మందన్న (Rashmika) కథానాయికగా నటించగా త్రిప్తి డిమ్రి మరో ఇంపార్టెంట్ రోల్ చేసింది. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత బాబీ డియోల్ కి వరుస ఛాన్సులు వస్తున్నాయి.

ఇప్పటికే సూర్య కంగువలో విలన్ గా చేస్తున్న ఆయన బాలకృష్ణ 109వ సినిమాలో కూడా ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ దేవర 2 లో కూడా బాబీ ఉంటాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా దళపతి విజయ్ (Vijay) సినిమాలో కూడా బాబీ డియోల్ (Bobby Deol) ఛాన్స్ అందుకున్నాడు.

విజయ్ 69 లో బాబీ డియోల్ విలన్..

వినోద్ డైరెక్షన్ లో విజయ్ 69వ సినిమాగా చేస్తున్న ప్రాజెక్ట్ లో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాకు గాను ఆయన మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమాకు గాను బాబీ డియోల్ 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్.

బాలీవుడ్ కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం నుంచి యానిమల్ తో తన సత్తా చాటిన బాబీ డియోల్ తిరిగి సూపర్ ఫాం ను కొనసాగిస్తున్నారు. సో చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ పడినా మళ్లీ బాబీ స్టామినా చూపించే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Rashmika Mandanna : రష్మిక తొలి ఆడిషన్ వీడియో చూశారా..?