Site icon HashtagU Telugu

Animal Touch for Pushpa 2 : పుష్ప 2 కి యానిమల్ టచ్.. నెక్స్ట్ లెవెల్ అంతే..!

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Animal Touch for Pushpa 2 ఆగష్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని సుకుమార్ అండ్ టీం బాగా కష్టపడుతున్నారు. పుష్ప 2 సినిమా అంచనాలకు మించి ఆడియన్స్ ను థ్రిల్ చేసేలా ఉండాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 2 సినిమా ప్రతి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ గా పుష్ప పుష్ప రిలీజ్ కాగా రెండో సాంగ్ సూసేకి సాంగ్ ప్రోమో వచ్చింది.

అయితే పుష్ప 2 ఐటెం సాంగ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ సూపర్ హిట్ కాగా పుష్ప 2 లో అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీని ఫైనల్ చేశారని అంటున్నారు.

యానిమల్ సినిమాలో చేసిన చిన్న పాత్రతోనే సంచలనం సృష్టించింది త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కన్నా త్రిప్తికి ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లోనే కాదు త్రిప్తికి సౌత్ లో కూడా సూపర్ డిమాండ్ ఏర్పడింది. అదే బజ్ తో పుష్ప 2లో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించాలని చూస్తున్నారట.

పుష్ప 2 లో త్రిప్తితో ఐటెం సాంగ్ చేయిస్తే అది ఉ అంటావాని మించి ఉంటుందని అంటున్నారు. యానిమల్ తో యూత్ ఆడియన్స్ కి దగ్గరైన త్రిప్తి పుష్ప 2 సాంగ్ చేస్తే అది మరింత ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నారట. ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : M.S.Subbalakshmi Biopic : వెండితెర సుబ్బలక్ష్మి ఎవరు.. రేసులో ఆ ముగగ్గురు భామలు..!