జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. 'యానిమల్' వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.

Published By: HashtagU Telugu Desk
Animal

Animal

Animal: టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ (Animal) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 917 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండేళ్ల తర్వాత జపాన్‌లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘యానిమల్’ చిత్రం ఫిబ్రవరి 13, 2026న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ప్రకటన పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా ట్రేడ్ వర్గాలు మాత్రం దీనిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇటీవల బాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’, యానిమల్ సినిమా డొమెస్టిక్, ఓవర్సీస్, గ్లోబల్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. జపాన్ వంటి కొత్త మార్కెట్లలో విడుదల చేయడం ద్వారా ‘యానిమల్’ తన ఓవరాల్ బాక్సాఫీస్ వసూళ్లను మరింత పెంచుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. ‘యానిమల్’ వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. జపాన్ విడుదలతో ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ లెక్కలు ఎంతవరకు మారతాయో తెలియాలంటే ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. పోటీ తక్కువగా ఉండటం, హాలిడే సీజన్ కలిసిరావడంతో ఈ చిత్రం ఇప్పుడు రూ. 1000 కోట్ల గ్లోబల్ గ్రాస్ మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది హిందీ సినిమా చరిత్రలో మరో చారిత్రాత్మక విజయంగా నిలవనుంది.

  Last Updated: 24 Dec 2025, 08:57 PM IST