Animal OTT Release : ఆల్ క్లియర్ ఫర్ యానిమల్ ఓటీటీ రిలీజ్.. వాళ్లకిక పండుగే..!

Animal OTT Release రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి బంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Animal OTT Release T Series All Cleared Issues

Animal OTT Release T Series All Cleared Issues

Animal OTT Release రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి బంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో రణ్ బీర్ నటన, రష్మిక పర్ఫార్మెన్స్ ఇలా అన్నీ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్ లో 900 కోట్ల దాకా యానిమల్ సినిమా వసూళు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

నెట్ ఫ్లిక్స్ యానిమల్ రైట్స్ భారీ ధరకు కొనగా జనవరి 26న డిజిటల్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 10 రోజుల క్రితం సినీ 1 వారు టీ సీరీస్ తో ఉన్న ఆర్ధిక లావాదేవీల వల్ల సినిమా ఓటీటీ రిలీజ్ కానివ్వమని కోర్ట్ కి వెళ్లారు. అయితే దీనిపై చర్చలు జరిపిన టీ సీరీస్ టీం ఓటీటీ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ పొందినట్టు తెలుస్తుంది.

సినీ 1 తో తమకు ఉన్న అగ్రిమెంట్ కరెక్ట్ గానే ఉందని సినిమా ఓటీటీ వెర్షన్ రిలీజ్ కంపల్సరీగా అనుకున్న డేట్ కి తెస్తామని మేకర్స్ చూచాయగా చెప్పారు. యానిమల్ సినిమా నెట్ ఓటీటీ వెర్షన్ లో 9 నిమిషాలు అదనంగా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ వంగ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Also Read : Siddharth Roy : అర్జున్ రెడ్డి కాదు అంతకుమించి.. సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ టాక్..!

  Last Updated: 23 Jan 2024, 06:01 PM IST