Site icon HashtagU Telugu

Animal Tripti Dimri : యానిమల్ బ్యూటీ లవ్ లో పడిందా.. ఆ బిజినెస్ మ్యాన్ తో మ్యాటర్ చాలా దూరం వెళ్లిందట..!

Animal Beauty Tripti Dimri Love With Business Man Sam Merchant

Animal Beauty Tripti Dimri Love With Business Man Sam Merchant

Animal Tripti Dimri బాలీవుడ్ లో అంతకుముందు 4 సినిమాలు చేసినా రాని క్రేజ్ యానిమల్ తో సంపాదించింది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రి. మామ్, పోస్టర్ బాయ్స్, బుల్ బుల్, కాలా సినిమాల్లో నటించిన తృప్తి డిమ్రి ఆ సినిమాలేవి ఆమెను లైం లైట్ లోకి తీసుకు రాలేదు కానీ సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమా మాత్రం అమ్మడిని స్టార్ గా మలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తృప్తి రేంజ్ మారిపోయింది.

ఒక్కసారి ఫోకస్ లోకి రాగానే అందరు ఆమె మీద దృష్టి పెడతారు. ఈ క్రమంలో తృప్తి డిమ్రి ఒకరితో లవ్ లో పడిందని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నరు. అంతకుముందు అనుష్క శర్మ తమ్ముడు కర్నేష్ శర్మతో క్లోజ్ గా ఉందని వార్తలు వచ్చయి. అయితే అతను ఏమయ్యాడో ఏమో కానీ లేటెస్ట్ గా తృప్తి డిమ్రి సామ్ మర్చంట్ అనే బిజినెస్ మెన్ తో లవ్ లో పడినట్టు తెలుస్తుంది.

రీసెంట్ గా తృప్తిప్తి డిమ్రి ఒక ఫంక్షన్ లో పాల్గొన్నది. వాటికి సంబందించిన ఫోటోలను ఇన్ స్టాగ్రాం స్టోరీస్ లో షేర్ చేసింది తృప్తి. ఈ ఫంక్షన్ లో సామ్ మర్చంట్ తో తృప్తి దిగిన ఫోటోస్ చూస్తే వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారా అనే డౌట్లు మొదలయ్యాయి. సామ్ మర్చంట్ గోవాలో వాటర్స్ బీర్ లాంజ్ అండ్ గ్రిల్ ఫౌండర్. సామ్ మర్చంట్ ని ఫాలో అవుతున్న తృప్తి అతనితో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఆమధ్య తృప్తి బర్త్ డే టైం లో కూడా సామ్ మర్చంట్ హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి అని ఒక మెసేజ్ కూడా ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లు ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read : Kamal Hassan : సమ్మర్ లోనే రిలీజ్.. ఇండియన్ 2 పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?