Anil Sunkara: చిరంజీవితో విబేధాలు.. భోళా శంకర్ నిర్మాత షాకింగ్ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల నటించిన చిత్రం భోళా శంకర్. ఇక ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) ఈ సినిమాను నిర్మించారు.

Published By: HashtagU Telugu Desk
Anil Sunkara

Compressjpeg.online 1280x720 Image 11zon

Anil Sunkara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల నటించిన చిత్రం భోళా శంకర్. ఇక ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి.. చిత్ర నిర్మాతను ఇబ్బంది పెడుతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఈ చిత్ర నిర్మాత ఈ విషయంపై షాకింగ్ ట్వీట్ చేశారు.

ఇలాంటి నిరాధారమైన రూమర్స్ సృష్టించడం వల్ల కొందరికి రాక్షసానందం లభిస్తుందేమో, కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఆందోళన కలుగుతుంది. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నాకు, చిరంజీవి గారికి మధ్య ఏదో వివాదం చెలరేగిందని వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం ఆపేయండి. ఇటువంటి సమయంలో నాకు అండగా ఉన్న పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

Also Read: Gannavaram : రేపు ముఖ్య అనుచ‌రుల‌తో వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ భేటీ.. టీడీపీలో చేరికకు సిద్ధం..?

భోళా శంకర్ ప్లాప్ కావడంతో చిత్ర నిర్మాత అనిల్ సుంకర భారీగా నష్టపోయారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి రూ.65 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, సినిమా విడుదలకు ముందే తన రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్మాతకు చిరు కండిషన్లు పెట్టారని వార్తలు వచ్చాయి. చిరు రెమ్యూనరేషన్ కోసం అనిల్ అమెరికాలోని తనకి సంబంధించిన ఫ్లాట్స్, ఆస్తులు బేరం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ ఆగకపోవడంతో అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

  Last Updated: 17 Aug 2023, 10:01 PM IST