Site icon HashtagU Telugu

Anil Sunkara : ఖరీదైన తప్పులు చేశాం.. ఏజెంట్, భోళాశంకర్ పై మరోసారి నిర్మాత వ్యాఖ్యలు..

Anil Sunkara Indirect Tweet on Agent and Bhola Shankar Movie Flops

Anil Sunkara Indirect Tweet on Agent and Bhola Shankar Movie Flops

అఖిల్(Akhil) మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ పెట్టి ఏజెంట్ సినిమాతో దారుణమైన పరాభవాన్ని చూశారు. ఇటీవల చిరంజీవి(Chiranjeei) భోళా శంకర్ సినిమాతో వచ్చి ఫ్లాప్ చూశారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది నిర్మాత అనిల్ సుంకరనే. ఈ రెండు సినిమాల వల్ల దాదాపు 60 కోట్లకు పైగా ఆయనకు నష్టాలు వచ్చినట్టు సమాచారం. గతంలో అనిల్ సుంకర(Anil Sunkara) ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని స్వయంగా ఒప్పుకుంటూ ట్వీట్ చేయడం వైరల్ అయింది .

ఇప్పుడు మరోసారి అనిల్ సుంకర చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అనిల్ సుంకర నిర్మాణంలో సందీప్ కిషన్ హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించట్లేదు. దాదాపు 1 ఇయర్ నుంచి ఈ సినిమా సాగుతుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది.

తాజాగా చిత్ర దర్శకుడు VI ఆనంద్ ట్విట్టర్ లో.. కొంతమంది ఈ సినిమాని విరూపాక్షతో పోలుస్తున్నారు. జోనర్ ఒకటే కావచ్చు కానీ కథలు వేరు. అలాగే ఈ సినిమాకు VFX వర్క్ జరుగుతుంది. మంచి అవుట్ పుట్ ని అందించాలని పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాం. అందుకే సినిమా రిలీజ్ లేట్ అవుతుంది అని చెప్పారు.

 

ఈ ట్వీట్ ని రీ షేర్ చేస్తూ చిత్ర నిర్మాత అనిల్ సుంకర.. గతంలో చాలా ఖరీదైన తప్పులు చేశాం. అలాంటి తప్పులు మళ్ళీ చేయాలనుకోవట్లేదు. అందుకే VFX వర్క్ మొత్తంపూర్తయ్యాక సినిమా రిలీజ్ డేట్ ని మేమె ప్రకటిస్తాము. ఇలాంటి సినిమాకు VFX చాలా అవసరం. త్వరలోనే రెండో పాట డీటెయిల్స్ ని ప్రకటిస్తాం అని తెలిపారు. దీంతో మరోసారి ఇండైరెక్ట్ గా ఏజెంట్, భోళా శంకర్ సినిమాలపై ట్వీట్ చేయడం అభిమానులకు నచ్చట్లేదు.

 

Also Read : Siddhu Jonnalagadda : డీజే టిల్లు నెక్స్ట్ సినిమా.. వెరైటీ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో..