Site icon HashtagU Telugu

Rajasekhar : ఫాదర్ రోల్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్.. హీరో ఎవరో తెలుసా..?

Angry Young Man Rajasekhar In Father Role For Young Hero Movie

Angry Young Man Rajasekhar In Father Role For Young Hero Movie

Rajasekhar యంగ్ హీరో శర్వానంద్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో లేటెస్ట్ బజ్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. శర్వానంద్ 35వ సినిమా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలో మిగతా పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత శర్వానంద్ అధిలాష్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుందిల్. ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్, మాళవిక నాయర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఫాదర్ రోల్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నారని తెలుస్తుంది.

హీరోగా దాదాపు కెరీర్ ముగిసిందని భావిస్తున్న రాజశేఖర్ స్పెషల్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో నితిన్ తో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు. లేటెస్ట్ గా శర్వానంద్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. శర్వానంద్, రాజశేఖర్ ఈ కాంబినేషన్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ అందించనుందని చెప్పొచ్చు.

Also Read : Balakrishna : కన్నప్పలో బాలకృష్ణ.. మంచు విష్ణు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!