Site icon HashtagU Telugu

Ram Pothineni : ఆంధ్రా కింగ్ అంటున్న రామ్

Ram Andhraking

Ram Andhraking

టాలీవుడ్‌లో కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి వెనుకాడని యంగ్ హీరోల్లో రామ్ (Ram) పోతినేని ఒకరు. దర్శకుడి ట్రాక్ రికార్డ్, హిట్ – ఫ్లాప్‌లు పట్టించుకోకుండా కథ నచ్చితే సినిమా చేయడానికి సిద్ధమవుతారు. ప్రస్తుతం రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం మరో కొత్త దర్శకుడితో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రామ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Maruti Suzuki Eeco : అతి తక్కువ ధరలో 7 సీటర్ కారు కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే ఇది మీకోసమే !

‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థలో రామ్ పోతినేని హీరోగా ఒక భారీ సినిమా చేయబోతున్నారు. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కిషోర్ గోపు చెప్పిన కథకు రామ్ వెంటనే అంగీకరించారని సమాచారం. కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ, కథపై నమ్మకంతో ముందుకు వెళ్ళడం రామ్ ప్రత్యేకతగా మారింది. ఈ చిత్రం 2026 జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మాత్రం నవంబర్ 28, 2025న విడుదల కానుంది.

రామ్ పోతినేని గతంలో కూడా ఇలాంటి రిస్క్‌లు తీసుకున్నారు. ‘కందిరీగ’ సినిమాతో సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సెకండ్ హ్యాండ్’ విఫలమైన తర్వాత కిషోర్ తిరుమలకి ‘నేను శైలజ’ అవకాశం ఇచ్చారు. పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ను నమ్మి చేసారు. ఇలా హిట్ – ఫ్లాప్‌లను పక్కన పెట్టి, కేవలం కథపై నమ్మకంతో ముందుకు వెళ్తున్న రామ్, తన కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిని అందుకోబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు.