సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) కేవలం సినిమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో ముందుంటారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ వారికీ కనిపించే దేవుడు అయ్యాడు. ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా ఇప్పటివరకు ఉచితంగా తన సొంత డబ్బుతో దాదాపు 4500 మంది పిల్లకు గుండె ఆపరేషన్లు చేయించినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ (Andhra Hospitals Successfully Completed 4500+ Children Heart Surgeries) ప్రకటించింది. మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundations) ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని మహేష్ భార్య నమ్రతా తెలిపారు.
Indian Breads : టాప్-50 బ్రెడ్లలో 8 మన దేశానివే.. నంబర్ 1 మనదే
మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్ స్థాపనకు ఆమె సహకరించారు. దీని ద్వారా తల్లిపాలను అందించలేని పిల్లలకు తగిన పోషకాహారం అందించేందుకు వీలు పడుతోంది. అంతేకాదు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ టీకాను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేలా చేస్తున్నాయి.
Return of The Dragon : సూపర్ హిట్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక మహేశ్ బాబు నటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా ఉన్నాయి. చిన్నారుల హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించడమే కాకుండా, ఆరోగ్య సంబంధిత పలు కార్యక్రమాలను కూడా ముందుండి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అమలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మహేశ్ బాబు గొప్ప మనసుతో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.