యాంకర్ శ్యామల (Anchor Shyamala)..ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అందరికి సుపరిచితురాలే..కానీ ఆ తర్వాత అందరికి దూరమైంది. వైసీపీ పార్టీకి జై కొడుతూ..కూటమి పార్టీల పై విరుచుకపడమే ఆమె చేసిన తప్పు. అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం పేరుతో రచ్చ చేస్తే..చివరికి ఏకాకి అవుతారని శ్యామల ద్వారా మరోసారి రుజువైంది. ప్రస్తుతం వైసీపీ కి భజన చేస్తూ..అప్పుడప్పుడు మీడియా లో కనిపిస్తున్న ఈమె..ఇప్పుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) టైటిల్ తో..
Power Supply : వేసవిలో విద్యుత్ సమస్యలు రావొద్దు – అధికారులతో భట్టి
తాజాగా శ్యామల ‘కోబలి’ (Kobali Web Series) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. శ్యామలకి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో శ్యామల చాలా ఇంట్రస్టింగ్‌గా కనిపించింది. ‘కోబలి’ అనే టైటిల్ వెనుక చాల పెద్ద మ్యాటరే ఉంది. గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కోబలి టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు. సినిమా ప్రకటన కూడా చేసాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో కోబలి కథను రాసుకున్నాడు. పాటలు.. ఫైట్లు.. ఐటమ్ సాంగ్స్.. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లాంటి హంగామా లేకుండా.. కేవలం గంట నలభై ఐదు నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ‘కోబలి’ సినిమాను తెరకెక్కించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేశారు కానీ.. అది సెట్స్‌మీదికి రాకుండానే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం , త్రివిక్రమ్ సైతం ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అవ్వడం తో అంత కోబలి గురించి మరచిపోయారు. తాజాగా ఈ టైటిల్ తో ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తుండడం తో అందరి నోటా మరోసారి ఈ టైటిల్ వైరల్ గా మారింది.
Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు..!
తెలంగాణలోని ఒక గ్రామంలో జరిగే కథగా కోబలి అనే సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో నటుడు రవి ప్రకాశ్ ప్రధానమైన పాత్రను పోషించాడు. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ కొనసాగనుంది. రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రధానంగా నడుస్తుంది. రేవంత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.రీసెంటుగా ఈ సిరీస్ నుండి వచ్చిన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సిరీస్ లో యాంకర్ శ్యామల .. రాకీ సింగ్ .. జబర్దస్త్ నవీన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.