యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) పరిచయం అవసరం లేని వ్యక్తి. తన నేచురల్ స్టైల్, ఎంటర్‌టైనింగ్ టాలెంట్ మరియు గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులకు విశేషమైన గుర్తింపు సంపాదించారు. అనేక షోస్ తో అలరిస్తున్న ఇతగాడి పెళ్లి చూడాలని బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుండి కోరుకుంటున్నారు. మూడు పదులు దాటినా కానీ ప్రదీప్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రదీప్ ప్రేమ విషయం బయటకు వచ్చి అందర్నీ షాక్ లో పడేస్తుంది. ఏపీకి చెందిన కూటమి ఎమ్మెల్యేతో ప్రదీప్ ప్రేమలో ఉన్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెపుతున్నారు.
కూటమికి చెందిన ఎమ్మెల్యేతో దాదాపు రెండేళ్ల నుంచి ప్రదీప్ ప్రేమాయణం నడుపుతున్నరంట. ఆ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారని, అయితే.. ఏపీలో బడా రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె.. చదువుల తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారంట. అంతేకాదు.. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొందిందట. ఆ ఎమ్మెల్యే కూటమి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారట. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు.. బుల్లి తెరపై బిజీగా ఉంటే ఈ యాంకర్ కు ఎలా కుదిరిందనేది సస్పెన్స్ గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది ప్రదీపే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ప్రదీప్..’అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read Also : CM Revanth : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం ..ఇదేమైనా పాకిస్థాన్ అనుకుంటున్నావా..?