Anasuya Reaction on Johnny Master Issue : టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లో జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది. చిత్రసీమలో ఇలాంటి జానీ మాస్టర్ లు ఎంతో మంది ఉన్నారు కానీ ధైర్యం చేసి బాధితులు ముందుకు రావడం లేదని..ఆలా వస్తే ఎంతో మంది మాస్టర్ల బండారం బయటపడుతుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ జానీ ఫై పలు ఆంక్షలు విధించింది. మరోపక్క ఇండస్ట్రీ లో దీని గురించి ఓపెన్ అవుతూ బయటకు వస్తున్నారు. ఇప్పటీకే పూనమ్ కౌర్ , చిన్మయి తదితరులు దీనిపై స్పందించగా..తాజాగా అనసూయ (Anasuya) సైతం రియాక్ట్ అయ్యారు.
“అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రతిఘటించాలి. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్మందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని భావిస్తున్నాను” అని అభిప్రాయపడింది.
అంతకు ముందు జానీని ‘మాస్టర్’ అని పిలవద్దంటూ పూనమ్ (Poonam) సూచించింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi) .. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు.
ఇటు ఫిలిం ఛాంబర్ (Film Chamber) సైతం ..కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసింది. పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం జానీ నెల్లూరు లో ఉన్నట్లు సమాచారం. ఆయనకు నోటీసులు అందజేసేందుకు రాయదుర్గం పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది.
Read Also : MSME Policy : ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్