Anasuya : తీవ్ర గాయాలతో అనసూయ..ఆందోళనలో ఫ్యాన్స్

ముఖం నిండా గాయాలతో.. రక్తపు మరకలతో కనిపించింది. ఈ ఫోటో చూసిన తన ఫ్యాన్స్.. అనసూయకి ఏమైంది.. ఏదైనా ప్రమాదం జరిగిందా? మొహం నిండా ఆ రక్తం మరకలేంటీ ?

Published By: HashtagU Telugu Desk
Anu Face

Anu Face

అనసూయ (Anasuya Bharadwaj) ..పరిచయం అవసరం లేని పేరు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలాడి వరకు అనసూయ గ్లామర్ కు ఫిదా అవ్వాల్సిందే. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ ..తన గ్లామర్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అప్పుడెప్పుడో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పరిచమైన ఈమె జాతకాన్ని జబర్దస్త్ షో మార్చేసింది. కొన్నేళ్ల పాటు ఈ షో కు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఆ తర్వాత సినిమా ఛాన్సులు తలుపు తట్టడం..అక్కడ కూడా సక్సెస్ కావడం తో ఇక బుల్లితెర యాంకర్ కు బై బై చెప్పేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు వెండితెర , అటు సోషల్ మీడియా (Anasuya Social Media) లో ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు..తనపై వచ్చే విమర్శలకు , కౌంటర్లకు ఘాటైన సమాదానాలు చెపుతూనే..మరోపక్క ఘాటైన పిక్స్ షేర్ చేస్తూ వేడిసెగలు పుట్టిస్తుంటుంది.

తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ మాత్రం అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ముఖం నిండా గాయాలతో.. రక్తపు మరకలతో కనిపించింది. ఈ ఫోటో చూసిన తన ఫ్యాన్స్.. అనసూయకి ఏమైంది.. ఏదైనా ప్రమాదం జరిగిందా? మొహం నిండా ఆ రక్తం మరకలేంటీ ? కమిలిన గాయాలేంటీ అని షాక్ అవుతూ ఆందోళనకు గురయ్యారు. కాకపోతే ఇవి నిజంగా జరిగిన గాయాలు కాదు..ఆమె నటించిన సింబా మూవీ తాలూకా షూటింగ్ పిక్స్ అని అర్ధం అవుతుంది. సింబా చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో అనసూయ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ కోసం తాను ఎంత కష్టపడిందో..ఇలా పిక్ ద్వారా చెప్పకనే చెప్పింది.

Read Also : ACB Raids : మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు..

  Last Updated: 09 Aug 2024, 09:20 PM IST