పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తో తానొక స్పెషల్ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది స్టార్ యాంకర్ విలక్షణ నటి అనసూయ. స్టార్ మాలో లేటెస్ట్ గా వస్తున్న రియాలిటీ షోలో ఆమె హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో భాగంగా అనసూయ పవర్ స్టార్ తో చేయబోయే సాంగ్ గురించి రివీల్ చేసింది. ఐతే అనసూయ చెప్పిన సాంగ్ ఏ సినిమాలో అన్నది ఆలోచించడం మొదలు పెట్టారు ఆదియన్స్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అనసూయ ఇద్దరు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) లో అదిరిపోయే సాంగ్ చేస్తున్నారట. ఈ సాంగ్ గురించి అనసూయ చెబుతూ ఈ విషయం ఎక్కడ చెప్పలేదు కానీ నేను పవన్ కళ్యాణ్ సార్ తో ఒక సాంగ్ చేశా.. అది రిలీజ్ అయ్యాక అన్ని డాన్స్ ఫ్లోర్ లో అది వినిపిస్తుందని అన్నది
అనసూయ (Anasuya) తో పవన్ కల్యాణ్ సాంగ్ అనగానే ఆ సాంగ్ పై క్రేజ్ ఏర్పడింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉన్నా కూడా పవన్ వల్ల లేట్ అవుతూ వస్తుంది.
పవన్ ప్రస్తుతం వీరమల్లు సినిమా ముందు పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత ఓజీని కూడా ఫినిష్ చేస్తాడని టాక్. ఈ సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆలోచిస్తాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజైన టీజర్స్ అన్ని సినిమాపై సూపర్ బజ్ ఏర్పరిచాయి. నెక్స్ట్ 1 ఇయర్ లో పవన్ సెట్స్ మీద ఉన్న ఈ మూడు సినిమాలు రిలీజ్ అవనున్నాయి. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
Also Read : Polimera 3 : పొలిమేర 3కి కొత్త కష్టాలు.. మొదటి రెండు భాగాల్లోని సీన్స్‌ని..
