ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఎప్పటికప్పుడు తన స్టైల్, గ్లామర్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. న్యూస్ రీడర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, జబర్దస్త్ షో ద్వారా క్రేజ్‌ను సంపాదించుకున్న అనసూయ… ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్రలో ఆమె చూపించిన నటనకు సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. అంతేకాదు, పుష్ప వంటి పాన్ ఇండియా మూవీలోనూ అనసూయ కీలక పాత్రలో మెరిసింది.
Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
ఇక సోషల్ మీడియాలోను ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతిసారి సరికొత్త ఫొటోషూట్‌లతో తన అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు మాత్రం నెటిజన్లను మతిపోగొట్టేలా ఉన్నాయి. మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌ను మరింతగా హైలైట్ చేస్తూ దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్రత్యేకించి నడుము అందాలతో, నాభి అందాలను చూపిస్తూ తీర్చిదిద్దిన ఫొటోలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిజిక్ మెయింటెన్ చేయడంలో అనసూయ చూపించే నిఖార్సైన శ్రద్ధ ఆమె కెరీర్‌లో స్థిరంగా నిలబడటానికి కీలకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. “ఎంత వయసైనా నువ్వు చిన్నదానిలా కనిపిస్తావ్” అని కొందరు కామెంట్ చేస్తే, “నీ అందాల్లో ఉన్న కిక్కే వేరబ్బా” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతూ యంగ్ హీరోయిన్స్‌కి పోటీగా మారుతున్న అనసూయ, తన అందాలతో పాటు నటనా ప్రతిభతోనూ ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతగానో ముందున్నారు. ప్రస్తుతం ఈ హాట్ ఫొటోలు నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి.