Anasuya Bharadwaj: ఫారిన్ లో చిల్ అవుతున్న అనసూయ, లేటెస్ట్ ఫిక్స్ వైరల్

నటి, యాంకర్ అనసూయ మాన్ సూన్ సీజన్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Anasuya

Anasuya

నటి, యాంకర్ అనసూయ మాన్ సూన్ సీజన్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్స్ నుంచి ఏమాత్రం గ్యాప్ దొరికినా వెకేషన్ కు వెళ్లడం కామన్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ లో పర్యటిస్తున్న అనసూయ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ వద్ద తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగింది.

కుటుంబంతో ఎక్కువ సమయం కలిసి ఉండటం ఉత్తమం అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నైస్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ ఎంజాయ్ ది ట్రిప్ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు రెచ్చిపోయే అందాలు ప్రదర్శించే అనసూయ ఈ సారిమాత్రం పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది. గతంలో అనసూయ థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు పెట్టిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇటీవల పెళ్లి రోజును పురస్కరించుకుని ఆమె ఇచ్చిన అందాల విందు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వరసబెట్టి గ్లామర్‌తో కొడుతూనే ఉంది. ఆమె యాక్టింగ్, యాంకరింగ్ అనేవి పక్కన పెడితే.. ఆమె ఇచ్చే గ్లామర్ ట్రీట్‌‌కు ఎలాంటి వాడైనా కళ్లప్పగించి అలా చూస్తుండిపోవాల్సిందే. పొట్టి దుస్తులతో రెచ్చిపోతూ ఫొటోషూట్స్ చేస్తుండటంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అనసూయ ప్రస్తుతం పుష్ప2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Heavy Rains: తెలంగాణలో రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు

  Last Updated: 27 Jul 2023, 12:21 PM IST