Site icon HashtagU Telugu

Shivangi : నేను వంగే రకం కాదు.. మింగే రకం.. ఆసక్తిరేపుతున్న ‘శివంగి’ టీజర్‌

Shivangi Teaser

Shivangi Teaser

Shivangi : తెలుగమ్మాయి ఆనంది తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్. ఆమె ఇప్పటివరకు అనేక క్లాస్ , క్యూట్ పాత్రలలో కనిపించి, మంచి అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి “శివంగి” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు నిర్మించగా, దేవరాజ్ భరణి ధరణ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్ విజయ్ , డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పుడు రెండు ముఖ్యమైన అప్‌డేట్లు వెలువడ్డాయి. మొదట, ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది, తర్వాత “శివంగి” సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయబడింది. టీజర్ చూస్తుంటే, ఈ సినిమా ఒక భార్య పాత్రలో ఉన్న ఆనంది, అనేక కష్టాలు ఎదుర్కొంటూ, వాటిని ఎలా ఎదుర్కొంటుంది అనే కథతో రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ పాత్రలో ఆమె తన నటనతో నిజంగా ఆకట్టుకోవడం ఖాయం.

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఆధిపత్యం ఎవరిది?

అలాగే, ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రెండు ప్రధాన పాత్రలతో సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉందని చెప్పవచ్చు. టీజర్‌లో ఒక ప్రముఖ డైలాగ్ వినిపిస్తుంది: “వంగేవాళ్ళు ఉన్నంత వరకు.. మింగేవాళ్ళు ఉంటారు.. నేను వంగే రకం కాదు.. మింగే రకం!” ఈ డైలాగ్ ద్వారా ఆనంది మాస్ టచ్ కనిపిస్తుండటం, ఆమె సినిమాతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సత్తా చూపించబోతుందనే అర్థం వస్తుంది.

ఇప్పటివరకు ఆనంది క్లాస్ , క్యూట్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది, కానీ “శివంగి” సినిమాలో ఆమె తొలిసారి మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఈ సినిమాతో ఆనంది కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?