Site icon HashtagU Telugu

Amy Jackson : రెండో బిడ్డకు జన్మనిచ్చిన మెగా హీరోయిన్

Amy Jackson Welcomes Baby B

Amy Jackson Welcomes Baby B

ప్రముఖ నటి అమీ జాక్సన్ (Amy Jackson) రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అమీ, బాలీవుడ్‌తో పాటు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మదరాజపట్నం’, ‘ఎవడు’, ‘ఐ’, ‘రోబో 2.0’ వంటి చిత్రాలతో భారీ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్‌లో ఉండగానే ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట, పెళ్లికి ముందే ఓ కుమారుడికి జన్మనిచ్చింది. కానీ కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా వీరి సహజీవనం ముగిసింది.

Warner : క్షేమపణలు కోరిన రాజేంద్రప్రసాద్

ఆ తరువాత కొంతకాలం సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన అమీ, బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో మరోసారి ప్రేమలో పడింది. ఈ ప్రేమ బంధాన్ని అమీ, వివాహంతో కొత్త జీవితానికి తీసుకెళ్లింది. వివాహం అనంతరం ఆమె మరోసారి గర్భవతి అయ్యిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేయించి, అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చిన అమీ, తన భర్త ఎడ్ వెస్ట్‌విక్, తన కుమారుడితో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన బిడ్డకు ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్’ (Alexander Westwick) అనే పేరు పెట్టినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, సన్నిహితులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.