Site icon HashtagU Telugu

Amy Jackson : రెండోసారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. దీపావళి నాడు భర్తతో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి..

Amy Jackson became Pregnant Second time Baby Bump Photos goes Viral

Amy Jackson

Amy Jackson : హీరోయిన్ అమీ జాక్సన్ రెండోసారి తల్లి కాబోతుంది. ఎవడు, ఐ.. లాంటి పలు సినిమాలతో సౌత్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత బ్రిటన్ వెళ్లి సెటిల్ అయింది. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బిడ్డను కన్న అమీ జాక్సన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది.

ఇటీవల ఆగస్టులో బ్రిటన్ యాక్టర్ అయిన ఎడ్ వెస్ట్‌విక్‌ ని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

ఆగస్టులో ఎడ్ వెస్ట్‌విక్‌ – అమీ జాక్సన్ జంట పెళ్లి చేసుకోగా తాజాగా అమీ జాక్సన్ ప్రగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టింది. తన భర్త ఎడ్ వెస్ట్‌విక్‌ తో కలిసి దిగిన బేబీ బంప్ ఫోటోలు దీపావళి నాడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Also Read : Kiran Abbavaram Ka Review & Rating : క రివ్యూ & రేటింగ్