Site icon HashtagU Telugu

Amitabh Bachchan : షూటింగ్‌లో గాయపడి అమితాబ్ కోమాలోకి వెళ్లిపోయారు.. ఆ విషయం మీకు తెలుసా?

Amitabh Bachchan went to coma in that movie shooting do you know the story

Amitabh Bachchan went to coma in that movie shooting do you know the story

బాలీవుడ్(Bollywood) బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) 8 పదుల వయసు దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. ఒక పక్క నార్త్ అండ్ సౌత్ మూవీల్లో నటిస్తూ, మరో పక్క టీవీ షోలు కూడా చేస్తూ అదరగొడుతున్నారు. కాగా అమితాబ్ కి 1983లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వలన అమితాబ్ కోమాలోకి వెళ్లడం కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే.. 1983 లో అమితాబ్ ‘కూలీ(Coolie)’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలో పునీత్ ఇస్సార్‌ విలన్ గా నటించాడు.

ఇక వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో అమితాబ్ పొత్తికడుపు ప్రాంతం నుంచి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఆయనలో ఎటువంటి స్పందన లేకపోవడంతో వెంటిలేటర్‌ పై పెట్టిన వైద్యులు.. కుటుంబసభ్యులను దేవుడిని ప్రార్ధించుకోమని చెప్పారట. ఇక అమితాబ్ సతీమణి జయాబచ్చన్ ఆ మాటలతో చాలా భయాందోళనకు గురయ్యారు. దీంతో కొన్ని రోజుల పాటు చేతిలో హనుమాన్ చాలీసా పెట్టుకొని ప్రార్ధన చేస్తూ.. అమితాబ్ వద్దనే ఆమె కూర్చొని ఉన్నారట.

ఆ తరువాత అమితాబ్ బొటనవేలు కదలడాన్ని గమనించిన జయాబచ్చన్.. ఆ విషయాన్ని వెంటనే డాక్టర్స్ కి చెప్పారు. వైద్యులు చెక్ చేసి అమితాబ్ లో స్పందన గమనించారు. ఇక ఆయనకి అవసరమైన చికిత్సని అందించగా.. అమితాబ్ కోలుకొని మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే జయాబచ్చన్ మాత్రం.. ఈ సంఘటన తన జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని చేదు జ్ఞాపకం అంటూ చెప్పుకొస్తారు. కాగా అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ మూవీ సెట్స్ లో కూడా అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డారు కానీ కొద్ది రోజుల్లోనే కోలుకున్నారు.

 

Also Read : Sharwanand: ఘనంగా నటుడు శర్వానంద్ వివాహం.. పెళ్ళిలో సందడి చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..!