Site icon HashtagU Telugu

Amigos: ‘అమిగోస్‌’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Amigos

Amigos

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) నటించిన తాజా చిత్రం అమిగోస్‌ (Amigos). రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఫిబ్రవరి 10) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదలైన రోజే ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన సంస్థపై క్లారిటీ వచ్చేసింది.

అమిగోస్‌ (Amigos) సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతానికి నిర్మాతలతో ఉన్న ఒప్పందం మేరకు 8 వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలి. కానీ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి.. 8 వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్ ట్రిపుల్‌ రోల్‌ ప్లే చేశాడు. వాటిలో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు మరో రెండు భిన్నమైన కోణాల్లో సాగుతాయి.

Also Read:  Abhinaya: సీనియర్‌ నటి అభినయ పై లుకౌట్‌ నోటీసులు..

Exit mobile version