Site icon HashtagU Telugu

Amaran : ‘అమరన్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..?

Amaran 100cr

Amaran 100cr

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘అమరన్’ (Amaran ) బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటిందంటే అర్ధం చేసుకోవాలి. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ మంచి ఫ్యాన్సీ ధరకి కొనుగోలు చేసింది.

ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఇక ‘అమరన్’ మూవీ ఈ రేంజ్‌లో హిట్ అవ్వడానికి సాయి పల్లవి (Sai Pallavi) కూడా ముఖ్య కారణమని తన ఫ్యాన్స్ అంటున్నారు. ఇందు రెబెక్కా వర్గీస్ అనే పాత్రలో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించడంలో కూడా సక్సెస్ అయ్యింది సాయి పల్లవి.

Read Also : CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క పిలుపు