ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నం (Allu Kanakaratnam) పెద్దకర్మకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా హాజరయ్యారు. గత నెల 30న కనకరత్నం గారు మరణించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కేటీఆర్, జగదీశ్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా అల్లు కనకరత్నం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అలాగే అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పేలా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్లకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరికీ అల్లు కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది.