‘పుష్ప-2′(Pushpa 2)తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురం లో వంటి మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు బన్నీ ని దగ్గర చేసాయి.
Sodium : ఇక నుంచి సోడియం ఉప్పును తక్కువగా వాడండి, WHO హెచ్చరిస్తుంది..!
ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తారని, శివుడి కుమారుడు కార్తికేయుని పాత్రలో బన్నీ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’గా కార్తికేయుని ప్రయాణం, తండ్రి శివుడిని ఆయన తిరిగి కలుసుకోవడం వంటి అంశాలను చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాను హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్, గీత ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కబోతుంది.
ఇటీవలే నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని, దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తీయబోతున్నామని అన్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ నెల నుంచి మొదలు కానుంది. మొదట హీరో లేని సీన్స్ షూట్ చేస్తారు. అనంతరం బన్నీ జూన్ లో షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని నాగవంశీ తెలిపారు.