గత నాల్గు రోజులుగా అల్లు అర్జున్ (Allu Arjun) పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న థియేటర్ తొక్కిసలాట కేసు(Stampede Case)లో అరెస్టయి, ఒక రాత్రి జైల్లో గడిపి తరువాత డిసెంబర్ 14న ఇంటికి తిరిగి వచ్చారు. తనను స్వాగతించినప్పుడు, అల్లు అర్జున్ నానమ్మ ఆయనకు దిష్టి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నానమ్మ పాదాలను తాకి (grandmother’s feet)ఆశీర్వాదం తీసుకున్నారు.
అసలు ఏంజరిగిందంటే..
“పుష్ప 2: ది రూల్” ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద భారీ జనసందోహం ఏర్పడింది. ఈ ఘటనలో ఒక 35 ఏళ్ల మహిళ దుర్మరణం చెందగా, ఆమె 9 ఏళ్ల కుమారుడు గాయపడ్డాడు. ఈ సంఘటనపై విచారణ సందర్భంగా అల్లు అర్జున్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోబడ్డారు. అయితే, రూ. 50,000 పర్సనల్ బాండ్ మీద ఆయనకు నాలుగు వారాల ఇంటరిమ్ బెయిల్ మంజూరయింది. అల్లు అర్జున్ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన భార్య స్నేహకు హత్తుకోవడం, నానమ్మ ఆయనకు దిష్టి తీసే వీడియోలు సోషల్ మీడియాలో అందరి హృదయాలను కదిలించాయి. ఈ వీడియోల్లో స్నేహ కంటతడి పెట్టడం, కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ క్షణాలు అభిమానులందరినీ ఆకర్షించాయి.
ఇక అరెస్ట్ ఫై అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇది చాలా దురదృష్టకరం” అని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి తన పూర్తి సహాయాన్ని అందిస్తానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న నటించగా, సినిమా ఇప్పటికే రూ. 1000 కోట్లను దాటి ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
Read Also : Telangana Rice : తెలంగాణ బియ్యమా మజాకా.. క్యూ కడుతున్న రాష్ట్రాలు, దేశాలు!