Site icon HashtagU Telugu

Allu Arjun : పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ..కారణం అదేనా?

Allu Arjun

Allu Arjun

‘పుష్ప-2’ (Pushpa 2)చిత్రంతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన పేరులో మార్పులు (Name Changes) చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే జరిగిన కొన్ని వివాదాస్పద పరిణామాలతో పాటు కెరీర్‌లో మరింత మంచి ఫలితాలు అందుకోవాలని భావిస్తూ, తన పేరులో సంఖ్యా శాస్త్ర ప్రకారం కొన్ని మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా “U” లేదా “N” అక్షరాలను జోడించాలని యోచిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

YS Sharmila : దేశానికి ఈరోజు బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల కామెంట్స్

సినిమా పరిశ్రమలో పేరుతో పాటు సంఖ్యా శాస్త్రం ప్రాముఖ్యత సాధించిందని, చాలా మంది నటులు, దర్శకులు తమ పేర్లలో మార్పులు చేసి విజయాలను అందుకున్నట్లు గతంలో అనేక సందర్భాల్లో చూశాం. అల్లు అర్జున్ కూడా ఇదే బాటలో వెళ్లాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే బన్నీ తన కెరీర్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు, తన బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అల్లు అర్జున్ తన పేరును నిజంగానే మారుస్తారా? లేదా ఇవి పుకార్లేనా? అనే అంశంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. బన్నీ టీమ్ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Exit mobile version