Pushpa 3: పుష్ప 3 రిలీజ్ అయ్యేది అప్పుడే.. బన్నీ కోసం రంగం లోకి బాలీవుడ్ స్టార్ హీరో?

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 10:30 AM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పుష్ప సినిమా పేరు కూడా ఒకటి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప పార్ట్ 1 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప 2 సినిమా ఇంకా విడుదల కాకముందే పుష్ప 3 కి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు వారాలుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి రెండో పార్ట్ గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా షూటింగ్‌ కూడా పూర్తి కాలేదు.

కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజ్‌ న్యూస్‌ మాత్రం సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. పుష్ప 2 కి మరో సీక్వెల్‌ ఉంటుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆ మధ్య ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అల్లు అర్జున్‌.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పుష్ప 3 ఉండొచ్చు, ఇంకా చాలా పార్ట్ లు కూడా చేయవచ్చు అని అంటూనే మూడో పార్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పుష్ప 3 కూడా ఉండబోతోందట. అల్లు అర్జున్‌, సుకుమార్‌ మూడో పార్ట్ తీయాలని ఫిక్స్ అయ్యారు. పుష్ప 2 కి సంబంధించిన కంటెంట్‌ చూసుకున్నాక, పార్ట్ 3 కచ్చితంగా అవసరం అని భావించారట. దీంతో పుష్ప 3 ని కూడా తెరకెక్కించాలని భావిస్తున్నారట.

అంతేకాదు ఔట్‌పుట్‌ చూసుకున్నాక ఈ మూవీని కచ్చితంగా ఆగస్ట్ 15కి విడుదల చేయాని నిర్ణయించుకున్నారట. డేట్‌ని మార్చేది లేదని ఫిక్స్ అయ్యారట. మరోవైపు ఆ మూవీ విడుదలైన వెంటనే షూటింగ్‌ చేయనున్నారట.పుష్ప తో పాటే మూడో పార్ట్ కి సంబంధించిన మేజర్‌పోర్షన్‌ సీన్లు చిత్రీకరిస్తారట. పుష్ప 2 రిలీజ్ అయ్యాక మూడో పార్ట్ కి సంబంధించిన మిగిలిన పార్ట్ ని షూట్‌ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.వచ్చే ఏడాది సమ్మర్‌లో పుష్ప 3 రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ మార్చి 8నుంచి ప్రారంభం కాబోతుంది. వైజాగ్‌లో చిత్రీకరిస్తారట. ఇందులో అల్లు అర్జున్‌ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో బిగ్‌ స్టార్‌ యాడ్‌ కాబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. డాన్‌ పాత్రలో పుష్ప 2 లోనే ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది.