Site icon HashtagU Telugu

Allu Arjun Special Video: డ్రగ్స్ రహిత సమాజం కోసం అల్లు అర్జున్ స్పెషల్ వీడియో!

Allu Arjun Special Video

Allu Arjun Special Video

Allu Arjun Special Video: పుష్ప సినిమా సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం అల్లు అర్జున్ స్పెషల్ వీడియో (Allu Arjun Special Video) చేశారు. త‌న ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) ఖాతాలో షార్ట్ వీడియోను అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ ఈ వీడియోలో పిలుపునిచ్చారు. యాంటి నార్కోటిక్ టీంకు సహక‌రిస్తూ స్పెష‌ల్ వీడియోను బ‌న్నీ పోస్ట్ చేశారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు కాల్ చేయాలని అల్లు అర్జున్ ఈ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మూవీ పుష్ప‌-2. ఈ మూవీ డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే మూవీ ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర‌యూనిట్ షురూ చేసింది. ఇందులో భాగంగానే డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు త‌న వంతుగా రేవంత్ స‌ర్కార్‌కు స‌పోర్ట్ చేస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశాడు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది.

Also Read: YS Jagan Defamation: రూ. 100 కోట్ల ప‌రువు నష్టం దావా వేయ‌నున్న వైఎస్ జ‌గ‌న్‌!

ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. న‌మస్తే మీకు తెలిసిన‌వారు ఎవ‌రైనా డ్ర‌గ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్ర‌గ్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంట‌నే డ్ర‌గ్స్ ఆడిక్ట్స్‌ను రిహాబిటేష‌న్ సెంట‌ర్‌కు తీసుకెళ్లి వాళ్లు మామూలు మ‌నుషులు అయ్యేంత దాకా జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు. ఇక్క‌డ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్దేశం వారిని ప‌నిష్ చేయ‌టం కాదు. వాళ్ల‌కి హెల్ప్ చేయ‌టం. నెంబ‌ర్ గుర్తుంది క‌దా 1908 లెట్స్ హెల్ప్ ది విక్టిమిస్ ఫ‌ర్ బెట‌ర్ సోసైటీ అని చెప్పుకొచ్చారు.

ఇక అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-2 మూవీలో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న కూడా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో శ్రీలీల ఐకాన్ స్టార్‌తో క‌లిసి కిస్సిక్ అనే పాట‌కు స్టెప్పులు వేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు, ప్రొమోస్ అన్ని అభిమానులను విప‌రీతంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప‌-2 మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.