అల్లు అర్జున్ (Allu Arjun,) తనయుడు అల్లు అయాన్ కూతురు అల్లు అర్హల అల్లరి అందరికీ తెలిసిందే. ఇంట్లో వారు చేసే హంగామా అంతా తండ్రిగా పొంగిపోతూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈమధ్యనే హలోవీన్ సందర్భంగా తన గొడ్డలిని తీసుకెళ్లాడంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. తన ఫ్యాన్స్ కి వారసులను కూడా పరిచయం చేస్తూ అలరిస్తున్నాడు.
ఇప్పటికే అల్లు అర్హ గుణశేఖర్ డైరెక్ట్ చేసిన శాకుంతలం సినిమాలో నటించింది. అయాన్ ఎంట్రీ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఐతే వీరు రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ షోలో భాగంగా అల్లు అయాన్ తన అభిమాన హీరో ఎవరని అడిగితే అతను ప్రభాస్ పేరు చెప్పినట్టు తెలుస్తుంది.
రెబల్ స్టార్ పేరు చెప్పడంతో..
అల్లు వారసుడు రెబల్ స్టార్ పేరు చెప్పడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి అవుతున్నారు. ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ ల మధ్య కూడా మంచి క్లోజ్ నెస్ ఉంది. సో అల్లు అయాన్ ఇష్టమైన హీరో ప్రభాస్ అని తెలిస్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. అల్లు అయాన్ (Allu Ayan) తెరగేంట్రం గురించి అల్లు అర్జున్ ప్లాన్ ఎలా ఉందో కానీ కుర్రాడు మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 తో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ రాబోయే సినిమాలతో భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది.
Also Read : Pushpa 2 Special Song : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఫిక్స్.. రచ్చ రంబోలా గ్యారెంటీ..?