Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 మొదటి సాంగ్ వచ్చేసింది.. అసలు తగ్గేదేలే..

Allu Arjun Pushpa 2 First Song Lyrical Video Is Released

Allu Arjun Pushpa 2 First Song Lyrical Video Is Released

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ సీక్వెల్ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకుండడంతో.. మేకర్స్ కూడా ఏ మాత్రం రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ ని మూవీ టీం స్టార్ట్ చేసింది. ఈక్రమంలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టి.. ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. నేడు ఆ ఫస్ట్ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటని తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ చేసారు. చంద్రబోస్ లిరిక్స్ ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటని అజిజ్ అండ్ దీపక్ పాడారు. తమిళ్ వెర్షన్ ని కూడా ఈ ఇద్దరి చేతనే పాడించిన దేవిశ్రీ.. మిగిలిన భాషల్లో మాత్రం ఇతర సింగర్స్ తో పాడించారు. ఇక డాన్స్ విషయానికి వస్తే.. ప్రేమ్ రక్షిత్ పర్యవేక్షణలో విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మ అదిరిపోయే స్టెప్స్ ని డిజైన్ చేసారు. మొదటి భాగం సాంగ్స్ లాగానే.. ఈ పాట కూడా అదిరిపోయింది.

ఈ సాంగ్ ఆడియన్స్ అంచలనాలను అందుకునేలా ఉండడంతో.. మిగిలిన సాంగ్స్ పై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ పై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. మరి దేవిశ్రీ ఐటెం నెంబర్ ని ఏ రేంజ్ లో సిద్ధం చేసారో చూడాలి. కాగా ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు.

Also read : Ilaiyaraaja Copyright Notice: రజనీకాంత్ కు షాక్ ఇచ్చిన ఇళయరాజా.. నోటీసులు