గురువారం రిలీజైన Allu Arjun పుష్ప 2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసింది. మార్నింగ్ నుంచి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పుష్ప 2 (Pushpa 2 Collections) సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకెల్తుంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ అదిరిపోయాయి.
సినిమా చాలా చోట్ల రికార్డ్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. ముఖ్యంగా హిందీలో సినిమా 72 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఓవరాల్ గా పుష్ప 2 కి ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్ నెలకొల్పింది. పుష్ప 2 సినిమా సినిమా ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
సినిమాపై ఉన్న బజ్.. సినిమాకు వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ ఈ కలెక్షన్స్ కు కారణమని చెప్పొచ్చు. బాక్సాఫీస్ పై పుష్ప రాజ్ పంజా ఎలా ఉందో ఫస్ట్ డే ( Pushpa 2 First Day Collections) వసూళ్లను చూస్తేనే తెలుస్తుంది. పుష్ప 2 సినిమా దూకుడు చూస్తుంటే 1000 కోట్లు కొట్టేలా ఉన్నాడు. పుష్ప రాజ్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. రష్మిక (Rashmika) గ్లామర్.. ఇలా అన్ని కలిసి వచ్చి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.
పుష్ప 2 మాత్రమే కాదు పార్ట్ 3 పుష్ప ర్యాంపేజ్ అంటూ మరో భాగానికి రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు.
Also Read : Balakrishna Daku Maharaj : బాలయ్య డాకు మహారాజ్ లో ఆ హీరోల క్యామియో..?