Jawan: షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న బన్నీ.. నిజమెంత?

పఠాన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం జవాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజైన పఠాన్ హ్యుజ్ వసూళ్లు రాబట్టింది.

Jawan: పఠాన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం జవాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజైన పఠాన్ హ్యుజ్ వసూళ్లు రాబట్టింది. చాలా కాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. అక్కడ వరుస సినిమాలు ప్లాప్ అవుతుండటంతో సౌత్ సినిమా మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ చిత్రాలు ఇండియన్ సినిమాని షేక్ చేశాయి. దీంతో ఇండియన్ సినీ మేకర్స్ సౌత్ లో సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో షారుఖ్ పఠాన్ సినిమాతో వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ ని గాడిన పెట్టారు.

తమిళ ఇండస్ట్రీ సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న పఠాన్ చిత్రంలో షారుక్ ఖాన్, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నమోదయ్యాయి. ఫెయిల్యూర్ ఎరుగని అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో జవాన్ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో లెక్కల్లేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ అతిధి పాత్ర కోసం మేకర్స్ అల్లు అర్జున్ ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. పుష్ప సినిమాలో యమబిజీగా ఉన్న బన్నీ త్వరలోనే జవాన్ చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ లేకపోవడంతో ఆ వార్తలు కేవలం గాసిప్స్ గానే చూశారు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ అయితే వచ్చింది.

షారుక్ నటిస్తున్న జవాన్ చిత్రంలో అల్లు అర్జున్ నటించడం లేదని బలీఫుడ్ హంగామా ఓ నివేదిక తెలిపింది. జవాన్‌లో సంజయ్ దత్ మాత్రమే అతిధి పాత్ర పోషించనున్నారని, ఆ పాత్ర కోసం బన్నీని సంప్రదించలేదని కూడా పేర్కొన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జవాన్ జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి, అయితే మేకర్స్ దాని విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

Read More: Gold Seized : జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం